తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అధ్యక్షతన ఈరోజు చెన్నైలోని పనైయూర్ లో ఉన్న టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో రెండవ ప్రధాన కూటమి సమన్వయ సమావేశం ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ కీలక సమావేశంలో పాలన, రాజకీయ పరమైన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ రూపకల్పన, జాయింట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటుతో పాటు సెక్యులరిజం, సోషల్ జస్టిస్ సిద్ధాంతాల ప్రాతిపదికన కూటమికి ఒక అధికారిక పేరును, గుర్తింపును ఖరారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ సమావేశానికి కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, విసికె, ఐయుఎంఎల్, ఎండిఎంకే పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే జూలై 1 తర్వాత రెండవసారి సీపీఐ, సీపీఎం పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం బయట నుంచి మాత్రమే ఇష్యూ ఆధారిత మద్దతు ఇస్తామని, కేబినెట్ సీట్లు లేకుండా అధికారిక కూటమిలో చేరబోమని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. కార్మిక, వ్యవసాయ, ప్రజా విధానాలపై ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ తమకు కావాలని వారు తేల్చి చెప్పారు.
దీంతో టీవీకే మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీవీకే శాసనసభ్యులు, మంత్రులు విజయ్ ను రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా, తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశంపై తీవ్రంగా స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని ముఖచిత్రమని కాంగ్రెస్ వర్గాలు ఖరాకండీగా స్పష్టం చేశాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేష్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టీవీకే నేతలు విజయ్ ను ప్రధానిగా ప్రొజెక్ట్ చేసే లైన్ ను ఇలాగే కొనసాగిస్తే, కేబినెట్ లో తమ భాగస్వామ్యంపై పునరాలోచించాల్సి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఫలితంగా పరిణామాలు తీవ్రమవుతుండటంతో టీవీకే ఉన్నత నాయకత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ వ్యాఖ్యలు కేవలం కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని చెప్పి వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా సన్నని మెజారిటీపై నిలబడి ఉందనేది స్పష్టమవుతోంది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ కు చెందిన 5 మంది శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారగా, విసికె, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీలకు తలా 2 చొప్పున శాసనసభ్యుల బలం ఉంది. చిన్నపాటి అసంతృప్తి కూడా ప్రభుత్వ స్థిరత్వానికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్రహ్మానందంపై రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్: ‘ముసలి ము***డా కొడుకు’!
on November 30, 20250