తమిళనాడు సీఎం విజయ్ బర్త్‌డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. బ్రదర్ విజయ్ అంటూ జగన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు వైఎస్ జగన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. నేడు జూన్ 22న వైఎస్ జగన్ ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నా ప్రియమైన బ్రదర్ విజయ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా విజయ్ చేపట్టే ప్రతి అడుగులోనూ, అన్ని ప్రయత్నాలలోనూ గొప్ప విజయం సాధించాలని వైఎస్ జగన్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల డిజిటల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు యువ నేతల మధ్య ఉన్న బంధాన్ని ఈ ట్వీట్ మరోసారి స్పష్టం చేస్తోంది. వైఎస్ జగన్ ఇలా విజయ్‌ను బ్రదర్ అని సంబోధించడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. గతంలో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్చేపట్టిన తరుణంలోనూ జగన్ ఇలాగే బ్రదర్ అంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నాటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ, వ్యక్తిగత సెంటిమెంట్స్ పై ఇరు రాష్ట్రాల ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఉన్న పర్సనల్ రాపోపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. గతంలో చెన్నైలో జరిగిన విజయ్ సోదరుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ స్వయంగా హాజరయ్యారు. ఆ పెళ్లి వేడుకలోనే వీరిద్దరూ చివరిసారిగా కలిసి కాసేపు ముచ్చటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహితమైన, వెచ్చని వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు అగ్ర నేతల కలయికపై భవిష్యత్తు రాజకీయాల పరంగా రకరకాల అంచనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలకమైన ఇండియా కూటమి వైపు వీరిద్దరూ అడుగులు వేస్తారా అనే కోణంలో చర్చ సాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో ఈ బ్రదర్లీ బాండ్ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఫలితంగా వైఎస్ జగన్ చేసిన ఈ తాజా బర్త్‌డే ట్వీట్ కేవలం ఒక సాధారణ శుభాకాంక్షల పోస్ట్‌లా కాకుండా పొలిటికల్ ఇంపార్టెన్స్ సంతరించుకుంది. జూన్ 22 న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు యువ లీడర్ల పొలిటికల్ మూవ్స్ ఎలా ఉంటాయనేది హాట్ టాపిక్‌గా మారింది.