అమెజాన్‌కు స్పేస్‌ఎక్స్ షాక్.. మార్కెట్ వాల్యూలో సరికొత్త హిస్టరీ..!

స్పేస్‌ఎక్స్ ఐపీఓ ర్యాలీతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్. అమెజాన్‌ను దాటేసి $2.7 ట్రిలియన్ మార్కెట్ వాల్యూతో టాప్-5 లోకి చేరిన స్పేస్‌ఎక్స్.

గ్లోబల్ మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన స్పేస్‌ఎక్స్, లిస్టింగ్ తర్వాత ఊహించని రేంజ్‌లో భారీ ర్యాలీని కొనసాగిస్తోంది. ఈ మెరుపు వేగపు పెరుగుదలతో అమెజాన్ కంపెనీ మార్కెట్ క్యాప్‌ను స్పేస్‌ఎక్స్ విజయవంతంగా క్రాస్ చేసింది. ఫలితంగా జూన్ నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్-5 కంపెనీల జాబితాలో స్పేస్‌ఎక్స్ ఒకటిగా నిలిచింది. ఐపీఓ మార్కెట్లోకి అడుగుపెట్టిన తరుణంలో స్పేస్‌ఎక్స్ షేరు ధర ప్రారంభంలో $135 వద్ద లిస్ట్ అయింది. దీంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ రావడంతో లిస్టింగ్ తర్వాత ఏకంగా 60 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో కూడా ఈ స్టాక్ 10 శాతానికి పైగా లాభాలను సొంతం చేసుకుని ~$215 స్థాయికి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో స్పేస్‌ఎక్స్ మార్కెట్ వాల్యూ ఏకంగా ~$2.7 ట్రిలియన్ మార్కును దాటేసింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు గ్లోబల్ మార్కెట్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న అమెజాన్ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ~$2.65 ట్రిలియన్ వద్ద ఉంది. ఈ విలువను స్పేస్‌ఎక్స్ దాటేయడంతో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో నివిడియా, యాపిల్, ఆల్ఫాబెట్ కంపెనీలు మాత్రమే స్పేస్‌ఎక్స్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఫలితంగా ఎలోన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా $1.4 ట్రిలియన్ మార్కును దాటి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. స్పేస్‌ఎక్స్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రధానంగా స్టార్‌లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఒక కారణం. దీనితో పాటు అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ కూడా స్పేస్‌ఎక్స్ వృద్ధికి గట్టి పునాది వేసింది. ఈ నేపథ్యంలో ఎలోన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఉన్న కూడా ఈ భారీ మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. పోస్ట్-ఐపీఓ తర్వాత మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ స్టాక్ ర్యాలీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ఫ్లోట్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ స్టాక్‌లో వాలటైలిటీ అంటే హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం స్పేస్‌ఎక్స్ గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోంది. మొత్తానికి స్పేస్‌ఎక్స్ సాధించిన ఈ అసాధారణ విజయం అంతరిక్ష మరియు సాంకేతిక రంగాలలో కొత్త శకానికి నాంది పలికింది. అమెజాన్ లాంటి దిగ్గజాన్ని వెనక్కి నెట్టడం ద్వారా ఎలోన్ మస్క్ మార్కెట్ వ్యూహాలు ఎంత పటిష్టంగా ఉన్నాయో మరోసారి నిరూపితమైంది. రాబోయే రోజుల్లో స్పేస్‌ఎక్స్ తన మార్కెట్ విలువను మరింత పెంచుకుంటూ టాప్-3 స్థానాల వైపు దూసుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
By Chandrasekhar B — 17 June 2026