జైలర్ 2’ వాయిదా లేదు.. అక్టోబర్ 15న రజనీ మాస్ జాతర!
జైలర్ 2 పోస్ట్‌పోన్ రూమర్స్‌కు చెక్. రజనీకాంత్ మాస్ పోస్టర్‌తో 2026 అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ఖరారు చేసిన సన్ పిక్చర్స్.
సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు హృతిక్ రోషన్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ కానుకగా గురువారం రోజున జైలర్ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మేకర్స్ ఇచ్చిన ఈ అఫీషియల్ అప్‌డేట్‌తో దసరా బాక్సాఫీస్ రేసు మరింత హీటెక్కింది. సూపర్ స్టార్ మాస్ జాతరను థియేటర్లలో చూడటానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు.