బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న 'ఎన్‌బీకే 111' సినిమాకు గాడ్, దాదా అనే రెండు మాస్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. డిసెంబర్ 24 విడుదల లక్ష్యం.
నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్‌బీకే 111'. వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత వీరి కాంబినేషన్ పునరావృతం అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు పవర్‌ఫుల్ షార్ట్ మాస్ టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. అందులో ఒకటి 'గాడ్', మరొకటి 'దాదా' అనే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో చర్చించిన తర్వాతే చిత్ర యూనిట్ వీటిలో ఒకదానిపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమా కథాంశం మరియు మేకింగ్ కి సంబంధించిన వివరాలు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాంబే నేపథ్యంలో సాగే మాఫియా డాన్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ, రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా సరికొత్త ట్రీట్‌మెంట్‌తో ప్రేక్షకు ముందుకు తీసుకురావడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీకి సంబంధించి డిసెంబర్ 24 ముహూర్తంగా ముందే లీక్ కాగా, దానికి అనుగుణంగానే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రెండు అక్షరాల చిన్న టైటిల్స్ ట్రెండ్ బలంగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ 'ఓజీ', అల్లు అర్జున్ 'రాకా', చిరంజీవి 'కాకా' వంటి పేర్లు ఈ కేటగిరీలోనే వచ్చి విశేష ఆదరణ పొందుతున్నాయి. దీంతో 'ఎన్‌బీకే 111' కు కూడా 'గాడ్' లేదా 'దాదా' లాంటి క్యాచ్ టైటిల్స్ ఖరారు చేస్తే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, వచ్చే నెల నుంచి ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ పునఃప్రారంభం కానుంది. గతంలో వచ్చిన 'అఖండ 2' చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, అభిమానులందరూ ఇప్పుడు ఈ కాంబినేషన్ పైనే తమ భారీ ఆశలను పెట్టుకున్నారు. ఫలితంగా గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపుదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీలోని మాస్ యాక్షన్ సీన్స్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పలు రూమర్లపై చిత్ర బృందం స్పందిస్తూ అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది.