'మా ఇంటి బంగారం' మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్, రివ్యూ, కాస్ట్ & క్రూ, మరియు కలెక్షన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పూర్తి సినిమా ముచ్చట్లు మీకోసం!
సినిమా: మా ఇంటి బంగారం నటీనటులు: సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మి, మంజుష ముక్కవిల్లి, శ్రీముఖి, కృష్ణ చైతన్య, వెన్నెల కిషోర్ (కామియో) తదితరులు. సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్ ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల కథ, స్క్రీన్‌ప్లే: రాజ్ నిడిమోరు, వసంత్ మరిగంటి దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి నిర్మాతలు: రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వురు బ్యానర్: ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ విడుదల తేదీ: జూన్ 19, 2026 కథ : స్వర్ణ (సమంత) తన భర్త అనిరుధ్ (దిగంత్) తో కలిసి చాలా ఏళ్ల తర్వాత రాయలసీమలోని బల్లవరం అనే పల్లెటూరిలో ఉన్న పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెడుతుంది. అనిరుధ్ తన తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా స్వర్ణను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల, మొదట్లో ఈ జంటను ఇంట్లో వాళ్లు అంత తేలిగ్గా ఫ్యామిలీలో కలవనివ్వరు. కానీ ఎలాగైనా అత్తమామలను, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మనసులను గెలుచుకుని పర్ఫెక్ట్ కోడలిగా నిలబడాలని స్వర్ణ గట్టిగా ట్రై చేస్తుంటుంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి పద్ధతులు అస్సలు అలవాటు లేకపోయినా.. తన బెస్ట్ ఫ్రెండ్ (మంజుష) హెల్ప్ తీసుకుంటూ వంటల దగ్గర్నుంచి పూజల వరకు అన్నిట్లోనూ దూసుకుపోతూ ఫ్యామిలీకి దగ్గరవుతుంది. ఇలా అంతా హ్యాపీగా సాగిపోతున్న టైంలో.. ఒకరోజు కొందరు ముఠా మనుషులు ఆ ఊరికి వచ్చి స్వర్ణ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అసలు ఈమె స్వర్ణ కాదని, ఈమె వెనక ‘ఝాన్సీ’ అనే ఒక భయంకరమైన గతం ఉందని వాళ్లు డౌట్ పడతారు. కట్ చేస్తే.. స్వర్ణ అసలు పేరు ఝాన్సీ అని, పాస్ట్ లో ఆమె కరుణ (గుల్షన్ దేవయ్య) అనే ఒక పవర్‌ఫుల్ లీడర్ దగ్గర పెరిగి, అతని అసలు రంగు తెలిసి అక్కడి నుండి తప్పించుకుందని రివీల్ అవుతుంది. అప్పటినుండి తన ఐడెంటిటీ దాచుకుంటూ వేరే వేరే పేర్లతో బతుకుతూ చివరకు అనిరుధ్‌ను పెళ్లి చేసుకుంటుంది. జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకొచ్చిన కరుణ.. తనను మోసం చేసి పారిపోయిన ఝాన్సీని ఎలాగైనా పట్టుకుని తీరాలని కక్షతో రగిలిపోతుంటాడు. మరి తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ పాత గండం నుండి స్వర్ణ తనను తాను ఎలా కాపాడుకుంది? తన కొత్త ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ కరుణ ముఠాను ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా సినిమా. విశ్లేషణ : సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక మామూలు మనిషి వెనక అసాధారణమైన మాస్ గతం ఉండడం. రజినీకాంత్ ‘బాషా’ సినిమా దగ్గర్నుంచి మొన్నటి ‘సలార్’ వరకు హీరోల విషయంలో ఇలాంటి క్యారెక్టరైజేషన్లు చూసి చూసి ఆడియన్స్‌కు బాగా అలవాటైపోయింది. కానీ ఒక కమర్షియల్ మాస్ హీరో చేసే పనులను, అదే రేంజ్ ఇంటెన్సిటీతో ఒక టాప్ హీరోయిన్ చేస్తే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ లైన్‌తో వచ్చిన సినిమానే ఈ ‘మా ఇంటి బంగారం’. కెరీర్‌లో కొంచెం గ్యాప్ తర్వాత సమంత మెయిన్ లీడ్‌గా చేసిన ఈ మూవీ.. కంప్లీట్ గా ఆమె హీరోయిక్ ఇమేజ్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ సమంత మీద ఓపెన్ అయినప్పటి నుండి ఎండ్ కార్డ్ పడే వరకు ప్రతి సీన్ లోనూ తనే వన్ ఉమెన్ షోగా నిలబడింది. ఫస్ట్ హాఫ్ అంతా ప్యూర్ నందిని రెడ్డి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగిపోతుంది. అత్తగారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడలిగా, ఆ పెద్ద ఫ్యామిలీని మెప్పించడానికి సమంత పడే పాట్లు భలే ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్కకు పూజ చేసే సీన్ లో గానీ, అస్సలు వంట రాని సమంత తన ఫ్రెండ్ మంజుషతో కలిసి దొంగతనంగా కిచెన్ లో వంటలు మేనేజ్ చేసే సీన్లు గానీ థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తాయి. సమంత కామెడీ టైమింగ్ లో తన పాత మార్క్ మళ్లీ చూపించింది. ఇక్కడ సమంతకు జోడిగా చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ మంజుష నటన చాలా ఫ్రెష్ గా, అమాయకంగా ఉండి బాగా కనెక్ట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ వస్తున్నంత సేపు సినిమా చాలా సరదాగా, స్పీడ్‌గా నడిచిపోతుంది. కెమెరామెన్ ఓం ప్రకాష్ 90ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని, ఆ పెద్ద ఇళ్లను తన లెన్స్ లో చాలా నీట్ గా, కలర్ ఫుల్ గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ లో పల్లెటూరి రిచ్‌నెస్ కనిపిస్తుంది. అయితే కథ ఎప్పుడైతే ఫ్యామిలీ డ్రామా నుండి యాక్షన్ వైపు షిఫ్ట్ అవుతుందో, అక్కడ రాజ్ నిడిమోరు మార్క్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. బస్ ఫైట్ సీక్వెన్స్ గానీ, ఇంట్లో శవాన్ని దాచే సీన్ గానీ కథలో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మైనస్ ఏంటంటే.. కొన్ని యాక్షన్ బ్లాక్స్ లో స్టంట్ కొరియోగ్రఫీ మరీ పాతకాలం నాటి కార్లు, బైకుల ఛేజింగ్స్ లా అనిపించి ఒకింత బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అండ్ సమంత ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యే సీన్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాల్సింది. కానీ అక్కడ రైటింగ్ లో బలం లేకపోవడం వల్ల ఆ సీన్ చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ అని చెప్పినప్పటికీ.. ఝాన్సీ ఎందుకు అంత పెద్ద ఫైటర్ అయింది, విలన్ కరుణ ఆమె కోసం ఎందుకు అంత పిచ్చిగా వెతుకుతున్నాడు అనే పాయింట్స్ అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. సెకండ్ హాఫ్ అంతా చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేయొచ్చు. ఈ సినిమాలో విలన్ గా గుల్షన్ దేవయ్య నటన బాగున్నప్పటికీ, అతని క్యారెక్టరైజేషన్ చాలా రొటీన్ గా రాసుకోవడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సమంత భర్తగా చేసిన దిగంత్ రోల్ జస్ట్ సపోర్టింగ్ గానే ఉండిపోయింది. కమర్షియల్ సినిమాల్లో హీరో పక్కన ఉండే హీరోయిన్ క్యారెక్టర్ లాగా, ఇందులో సమంత పక్కన అతను ఒక ప్యాసింజర్ లా కనిపిస్తాడు. అయితే ఈ లోపాలన్నింటినీ సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, అద్భుతమైన యాక్టింగ్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది. చీర కట్టుకుని ఆమె చేసిన యాక్షన్ సీన్లు థియేటర్లలో విజిళ్లు వేయిస్తాయి. సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాను గట్టిగా లేపింది. ఎలివేషన్ సీన్లలో, క్లైమాక్స్ హౌస్ ఫైట్ లో వచ్చే డ్రమ్స్ అండ్ బేస్ స్కోర్ థియేటర్ లో మంచి హై ఇస్తుంది. పాత సినిమా పాటల రిఫరెన్సులు ముఖ్యంగా ‘ముత్యమంత ముద్దు’ సాంగ్ వాడిన విధానం మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. వెన్నెల కిషోర్ కామియో కూడా కాసేపు నవ్విస్తుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి, ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. టోటల్ గా కథలో కొత్తదనం లేకపోయినా, సమంత పెర్ఫామెన్స్ కోసం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కోసం ఈ సినిమాను ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు. ప్లస్ పాయింట్స్ : సమంత వన్ ఉమెన్ షో సూపర్ కామెడీ టైమింగ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్ : చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్‌ప్లే వీక్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ విలన్ క్యారెక్టర్ సాగతీతగా సెకండ్ హాఫ్ ఫైనల్ వర్డ్ : కథ పాతదే అయినా, సమంత తన పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ అండ్ మాస్ యాక్షన్ తో సినిమాను సేఫ్ జోన్ లో పడేసింది; ఫ్యామిలీతో కలిసి ఒకసారి హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. SkyC Rating: 2.75/5