ముకేశ్ అంబానీ భారీ స్కెచ్.. జియో ఐపీఓపై క్లారిటీ!

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ప్రక్రియ షురూ! రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ భారీ ప్రకటన చేస్తూ సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జూన్ 19న జరిగిన కంపెనీ 49వ వార్షిక సాధారణ సభలో డిజిటల్ విప్లవానికి తెరలేపారు. జియో ప్లాట్‌ఫార్మ్స్ బోర్డు డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను ఆమోదించిందని, ఈ రోజు సెబీకి సమర్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ఐపీఓగా నిలిచేందుకు అడుగులు పడ్డాయి. ఈ మెగా ఐపీఓ ద్వారా రూ.10 ఫేస్ వాల్యూ గల సుమారు 27 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ రూపంలో మార్కెట్లోకి జారీ చేయనున్నారు. మార్కెట్ పరిస్థితులు, బుక్ బిల్డింగ్ ప్రక్రియ ఆధారంగా ఈ షేర్ల ఫైనల్ ధరను నిర్ణయించనున్నారు. ఈ ప్రతిపాదిత ఐపీఓ ద్వారా సేకరించే నిధులను జియో వ్యాపార విస్తరణ, సాంకేతికత అప్‌గ్రేడేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సేవలు, 5G మరియు బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ మెరుగుదలలకు ఈ నిధులు కీలక మారబోతున్నాయి. భారత్ ప్రపంచ స్థాయి సాంకేతిక కంపెనీలను నిర్మించగలదని ప్రపంచానికి చాటేలా ఈ అడుగు మైలురాయిగా నిలుస్తుందని అంబానీ అభివర్ణించారు. ఇదిలా ఉండగా ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలు ఈ మెగా ఐపీఓ ప్రక్రియను ముందుండి నడిపించనున్నారు. జియో ప్లాట్‌ఫార్మ్స్ 2020లో గూగుల్, మెటా, కెకెఆర్, సిల్వర్ లేక్, సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ నుండి భారీగా పెట్టుబడులను సేకరించింది. ప్రస్తుతం 50 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో పాటు రూ.214 కి పెరిగిన అధిక ARPUతో జియో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఫలితంగా మార్చి 2026 త్రైమాసికంలో ఆపరేటింగ్ రెవెన్యూ 13% పెరిగి రూ.44,928 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో నికర లాభం కూడా 13% పెరిగి ఏకంగా రూ.7,935 కోట్లకు చేరుకుని బలమైన ఆర్థిక స్థితిని ప్రదర్శించింది. మార్కెట్ విశ్లేషకులు ఈ ఐపీఓపై భారీ అంచనాలు వేస్తున్నారు. ఎన్ఎస్ఈ, హ్యుందాయ్ మోటార్ ఇండియా రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. జియో వాల్యుయేషన్ సుమారు రూ.12-18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. సెబీ నుంచి తుది అనుమతులు వచ్చాక ఐపీఓ లాంచ్ టైమ్‌లైన్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మెగా ఐపీఓ భారత టెలికాం, డిజిటల్ సెక్టార్‌ గమనాన్ని మార్చేసే మైలురాయిగా నిలవనుంది. దేశవ్యాప్త డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసి, ఇండియన్ ఎకానమీ డిజిటలైజేషన్‌కు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను ఏఐ, న్యూ ఎనర్జీ, సాటిలైట్ కమ్యూనికేషన్స్ వంటి భవిష్యత్ రంగాల్లో విస్తరణకు ఉపయోగించనున్నారు. ఫలితంగా రిలయన్స్ గ్రూప్ వాల్యూ అన్‌లాకింగ్‌లో ఇది ఒక కీలకమైన అడుగు కానుంది. ఇది ఇన్వెస్టర్లకు సరికొత్త పెట్టుబడి అవకాశాలను సృష్టించబోతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ ఎకానమిక్ ఫ్యాక్టర్లు, రెగ్యులేటరీ అనుమతులు ఈ ఐపీఓ సక్సెస్‌పై ప్రభావం చూపవచ్చు. ఈ పరిణామాలన్నీ భారత స్టాక్ మార్కెట్‌కు ఒక బలమైన సానుకూల సంకేతంగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో సెబీ అనుమతి, ప్రైస్ బ్యాండ్, లిస్టింగ్ డేట్ వంటి అప్‌డేట్స్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో ఐపీఓ భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు ఒక నిదర్శనంగా నిలవబోతోంది.
By V Sudhakar — 19 June 2026