జియో సేవలు అస్తవ్యస్తం.. గ్రామస్తుల వినూత్న నిరసన..!
ఖానాపూర్ లోని సత్తనపల్లి గ్రామంలో జియో సేవలు అస్తవ్యస్తం. సిగ్నల్ కోసం వినూత్న నిరసన. పూర్తీ వివరాలు చదవండి.
ఖానాపూర్ రూరల్‌లోని సత్తనపల్లి గ్రామంలో జియో యూజర్లు వినూత్న నిరసన చేపట్టారు. మూడు నెలలుగా కరెంటు పోయినప్పుడల్లా మొబైల్ నెట్‌వర్క్ డౌన్ అవుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అత్యవసర కాల్స్, ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు కూడా సాధ్యం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. వేల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నా సరైన సేవ లభించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు జియో టవర్ ఎదుట మొబైల్ ఫోన్లు పైకి ఎత్తి "సిగ్నల్ కోసం వేచి చూస్తున్న" డ్రామాటిక్ ప్రదర్శన చేశారు. టవర్‌కు బ్యాకప్ పవర్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేదంటే ఇతర నెట్‌వర్క్‌లకు మారతామని వారు హెచ్చరించారు. ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. జియో సేవలపై వినూత్న నిరసన! ఖానాపూర్ రూరల్‌లోని సత్తనపల్లి గ్రామంలో జియో యూజర్లు సెల్ టవర్ ఎదుట మొబైల్ ఫోన్లు పైకి ఎత్తి "సిగ్నల్ కోసం వేచి చూస్తున్న" డ్రామాటిక్ ప్రదర్శన చేశారు. మూడు నెలలుగా కరెంటు పోయినప్పుడల్లా నెట్‌వర్క్ డౌన్ అవుతోందని, అత్యవసర కాల్స్, ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు కూడా సాధ్యం కావడం లేదని ఆవేదన. కస్టమర్ కేర్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదు. వేల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నా సరైన సేవ లేదని ఆగ్రహం. టవర్‌కు బ్యాకప్ పవర్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ — లేదంటే ఇతర నెట్‌వర్క్‌లకు మారతామని హెచ్చరిక. ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. జియో వినియోగదారులు కరెంటు పోయిన ప్రతిసారి మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. గత మూడు నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. నెట్ లేకపోవడంతో ఆన్‌లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలకు అంతరాయం కలుగుతోందని తెలిపారు.