కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా లేదా?

సిజెపి ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా లేదా అనే ఉత్కంఠపై తాజా సమాచారం. ప్రస్తుతం ఎలాంటి వారెంట్ లేకున్నా విచారణ జరిగే అవకాశం ఉంది.

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అతనిపై ఎలాంటి అరెస్ట్ ఆర్డర్ లేకపోవడం గమనార్హం. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. బోస్టన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతను జూన్ లేదా జులై నెలలో ఇండియా వస్తానని ప్రకటించాడు. అయితే ఇండియా రాగానే ఎయిర్‌పోర్టులోనే తనను అరెస్ట్ చేస్తారనే భయంలో అభిజీత్ ఉన్నాడు. ఈ తరుణంలో అభిజీత్ దీప్కే అరెస్ట్ అవుతారా అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. యువకులను "కాక్రోచెస్" అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించడంతో అభిజీత్ స్పందించాడు. దీనికి రియాక్షన్‌గా మే 16న కాక్రోచ్ జనతా పార్టీని ఒక వ్యంగ్య ఉద్యమంగా మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పార్టీకి కోట్ల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు, మెంబర్‌షిప్‌లు వచ్చాయి. నిరుద్యోగం, ఎగ్జామ్ లీక్స్, ఉద్యోగాల సమస్యలపై పోరాడుతుండటంతో దేశంలోని యువతలో ఈ పార్టీ బాగా హిట్ అయింది. దీంతో ప్రభుత్వం ఈ పార్టీపై చర్యలు ప్రారంభించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ భద్రతా కారణాలను చూపుతూ సీజెపి ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను ప్రభుత్వం విత్‌హెల్డ్ చేసింది. ఇదిలా ఉండగా, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయని, వెబ్‌సైట్ కూడా డౌన్ అయిందని అభిజీత్ ఆరోపిస్తున్నాడు. వీటిని త్వరగా అన్‌బ్లాక్ చేయడానికి ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించింది. ఫలితంగా ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే అభిజీత్ దీప్కే అరెస్ట్ భయం మొదలైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే తనను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తారని అతను భయపడుతున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదా అరెస్ట్ వారెంట్ పబ్లిక్‌గా నమోదు కాలేదు. కాబట్టి నేరుగా జైలుకు పంపించే అవకాశం తక్కువగా ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే యువతలో పెద్ద ఎత్తున ఉద్యమం రావడం వల్ల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. అభిజీత్ ఇండియాకు వచ్చినప్పుడు ఐటీ యాక్ట్ లేదా ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టి విచారించవచ్చు. గతంలో కూడా రాజకీయ వ్యతిరేక ఉద్యమాల్లో ఇలాంటి ఇంటరాగేషన్ సంఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే అభిజీత్ దీప్కే అరెస్ట్ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు ఇది కేవలం సాటిరికల్ మరియు యువత ఫ్రస్ట్రేషన్‌ను వ్యక్తపరిచే ఉద్యమం మాత్రమే. అభిజీత్‌పై ఇప్పటివరకు ఎలాంటి సీరియస్ చార్జెస్ లేవు కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టకపోవచ్చు. అతను వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టులో డిటైన్ చేసి కేవలం విచారణ జరిపి వదిలేసే అవకాశం ఉంది. డైరెక్ట్ జైలుకు పంపే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితి మారవచ్చు.

సిజెపి ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇండియా రాగానే అరెస్ట్ అవుతారా? ప్రస్తుత పరిస్థితి ఇదీ! #AbhijeetDeepke #CJP #CockroachJanta Party #DelhiAirport #TiharJail పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

By V Sudhakar — 01 June 2026